ప్రజాశక్తి-జగ్గయ్యపేట: విజయవాడ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ హారి ప్రసాద్ శర్మ, నందిగామ ఇన్స్పెక్టర్ సూర్య ప్రకాష్ ఆదేశాల మేరకు చిల్లకల్లు ఎస్ఓలో చిల్లకల్లు పోస్ట్ మాస్టర్ పెద్ది రమ ఆధ్వర్యంలో పోస్టల్ యూనియన్ నాయకులు పివి వసంతరావు అధ్యక్షతన మంగళవారం లిల్లీ ఫిలిఫ్ మెమోరియల్ అధినేత పి జైపాల్ తన సొంత వితరణతో 100 మంది పేద పిల్లలకి సుకన్య సమృద్ధి యోజన ఖాతాలను ప్రారంభించారు. ఎందరికో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన జైపాల్ ముందుగా 25 సుకన్య అకౌంట్ ఓపెన్ చేయడానికి సిద్ధపడ్డారు. ఈ కార్యక్రమానికి వారిని ఆహ్వానించి వారిని ప్రత్యేకంగా సన్మానించి వారి యొక్క సేవలను కొనియాడడం జరిగింది. అనంతరం వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ ఈనెల 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సర్కిల్ లక్ష అకౌంట్లు చేయటంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. జైపాల్ రిటైర్డ్ ఐఏఎస్ మరియు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మదన్ మోహన్ సతీమణితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో భాగం కావాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా జయపాల్ కి చిల్లకల్లు ఎస్ ఓ తరఫున, నందిగామ సబ్ డివిజన్, విజయవాడ డివిజన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది సరిత, విజయ్ సత్యనారాయణ, జమీర్, 10 సంవత్సరాల లోపు ఆడపిల్లల తల్లిదండ్రులు, లిల్లీ ఫిలిప్ మెమోరియల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.










