ప్రజాశక్తి-కోనసీమ : కౌలు రైతుల సమస్యల పరిష్కారానికై సిపిఎం ఆధ్వర్యంలో డా.బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కౌలు రైతుల రాష్ట్ర సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక జాతీయ నాయకులు వి కిరణ్ కుమార్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొని ప్రసంగించారు.










