Jul 20,2021 11:00

శ్రీశైలం : తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా... శ్రీశైలం జలాశయానికి వరద ఉధఅతి పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్‌ ఫ్లో 1,64,645 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ ఫ్లో మాత్రం 28,252 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 833.40 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టిఎంసిలు కాగా ప్రస్తుతం 53.1795 టిఎంసి లు ఉంది. ఇక ప్రస్తుతం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుండగా కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి మాత్రం ప్రారంభం కాలేదు.