ప్రజాశక్తి-విశాఖ : విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై ఉక్కు రక్షణ యాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర బైక్ యాత్రలో భాగంగా ఆదివారం సింహాచలం చేరుకున్న బైక్ యాత్రకు అడుగడుగునా కార్మిక సంఘాలు, పార్టీ శ్రేణులు, స్థానికులు హారతిలతో స్వాగతం పలికారు. ఈ ర్యాలీకి భవన నిర్మాణ కార్మిక సంఘం జీవీఎంసీ కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, స్థానికులు తమ మద్దతును తెలియజేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.













