ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : సుస్థిర అభివద్ధి లక్ష్యాలు సాధన సర్వే ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారించిందని ఇందుకూరుపేట ప్రాజెక్టు ఇంటిగ్రెటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫిసర్ (సిడిపీఓ) హేన సుజన్ పేర్కొన్నారు. గురువారం తోటపల్లిగూడూరు వైఎస్ క్రాంతి పదం కార్యాలయంలో సుస్థిర అభివద్ధి లక్షాల (ఎస్. డి.జి) సర్వేపై సూపర్ వైజర్లు కె. విజయలక్ష్మి, ఏ. సుబ్బమ్మ, జి. సునీతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా హేన సుజన్ మాట్లాడుతూ నవరత్నాలతో లింక్ అయిన ఇండికేటర్స్ డేటా ఎస్ డి జీ వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. సుస్థిర అభివద్ధి లక్ష్యాలలో ముఖ్యంగా హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, లా అండ్ ఆర్డర్ ఉన్నాయని వీటి ద్వారా అమలు చేసే వివిధ పథకాలు పూర్తి స్థాయిలో ఎస్ డి జి , జి ఎస్ డబ్ల్యూ ఎస్ వెబ్ సైట్ లలో అప్డేట్ చేయాలని హేన సుజన్ సూచించారు. అంగన్వాడీ చిన్నారులు (0-5), గర్భవతులు, బాలింతలు ఎట్టి పరిస్థితుల్లో రక్తహీనతకు గురికాకుండా పౌష్టికాహారం అందించడంతోపాటు, సంబంధిత మందులను రోజుకు రెండుసార్లు అందజేసేలా చూడాలన్నారు. రక్తహీనతను సాధారణంగా తీసుకోవద్దని హేన సుజన్ స్పష్టం చేశారు. గర్భిణీ స్త్రీలకు ప్రతి ఒక్కరికి రక్త పరీక్షలు నిర్వహించి రక్తహీనతను గుర్తించి సరైన ఆహారం, వైద్యం అందించాలన్నారు. ఈ మేరకు ప్రతి నెల సర్వే నిర్వహించి వారి యొక్క రక్తహీనత వివరాలు నమోదు చేయాలని ఆమె సూచించారు. ఈ మేరకు మండలంలోని అన్ని సచివాలయాల ఎం.ఎస్.కె. లకు ఎస్.డి.జి సర్వే వివరాలు ఎలా ఆన్లైన్ చేయాలో అవగాహన కల్పించారు. సమావేశంలో సచివాలయాల ఎం.ఎస్.కెలు, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు.










