Dec 17,2022 19:23

వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న శ్రీకాంత్‌రెడ్డి

ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌: నియోజకవర్గ ప్రజలందరికీ శుద్ధిజలం అందించడమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని 31, 32వ వార్డులు, సయ్యద్‌ యూసుఫ్‌ షాఖాద్రీ వీధిలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన 2000 ఎల్‌పిహెచ్‌ సామర్థ్యం గల మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను ప్రారంభించారు. ఈ ప్రాంతాలలో మినరల్‌ వాటర్‌ ట్యాంకులు ఏర్పాటు కావడంపై ఆ ప్రాంత ప్రజల్లో ఆనందం వ్యక్తమైంది. తమకు శుద్ధిజలం అందించినందుకు మినరల్‌ వాటర్‌ ట్యాంకుల ఏర్పాటుకు కృషిచేసిన శ్రీకాంత్‌రెడ్డికి స్థానిక కౌన్సిలర్లుకు ఆప్రాంతాల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాష, కౌన్సిలర్‌ గువ్వల లక్ష్మిదేవి, బుజ్జిబాబు, వైసిపి మదనపల్లె నియోజకవర్గ పరిశీలకులు హాబీబుల్లా ఖాన్‌, అలీ నవాజ్‌ ఖాన్‌, బేపారి మహమ్మద్‌ ఖాన్‌, మదన మోహన్‌రెడ్డి, ఫయాజ్‌ అహమ్మద్‌, అల్తాఫ్‌, ఆసీఫ్‌ అలీఖాన్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ తబ్రేజ్‌ ఖాన్‌, జిల్లా వక్ఫ్‌ బోర్డ్‌ సభ్యులు జాకీర్‌ హుసేన్‌, నవరంగ్‌ నిస్సార్‌, నాయకులు కొలిమి ఛాన్‌బాషా, ఎస్‌పిఎస్‌ రిజ్వాన్‌, రియాజ్‌, గౌస్‌ ఖాన్‌, సుగవాసి ఈశ్వర్‌ ప్రసాద్‌, జానం రవీంద్ర యాదవ్‌, అన్నా సలీం, జయన్న నాయక్‌, భాస్కర్‌, జబీఉల్లా, హజరత్‌ ఖాదర్‌ వలీ పాల్గొన్నారు.