ఎమ్మెల్సీగా డిక్లరేషన్ అందుకుంటున్న ఎస్.మంగమ్మ
అనంతపురం ప్రతినిధి : స్థానిక సంస్థల మండలి ఎన్నికలకు జరిగిన నామినేషన్లలో ఒక్క నామినేషన్ మాత్రమే ఆమోదం పొందింది. ఈ స్థానానికి జరిగిన నామినేషన్ ప్రక్రియలో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో వేలూరి రంగయ్యకు సంబంధించిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. అధికార వైసిపికి చెందిన మంగమ్మ ఒక్క నామినేషన్ మాత్రమే ఆమోదం పొందింది. ఉపసంహరణలు కూడా పూర్తయిన నేపథ్యంలో స్థానిక సంస్థల మండలి ఎన్నికలకు సంబంధించి మంగమ్మ ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి, ఇన్‌ఛార్జి కలెక్టర్ కేతన్‌గార్గ్ ప్రకటించారు. ఆ మేరకు సోమవారం సాయంత్రం ఆమెకు డిక్లరేషన్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉషచరణ్ శ్రీ, మాజీ మంత్రి ఎం.శంకర నారాయణ, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










