Sep 24,2023 22:53

మాట్లాడుతున్న సినీ దర్శకులు బి.వీర శంకర్‌


విజయవాడ : చిన్న చిత్రం, పెద్ద సందేశం పేరుతో గత 2 రోజుల నుండి మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న తెలుగు షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు ఈరోజు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ రోజు 15 లఘు చిత్రాల ను, 20 రీల్స్‌ ను ప్రదర్శిచారు.లఘు చిత్రాలు కేటగిరీలో ఉత్తమ చిత్రాలుగా నాన్న,వనమాలి, జన్మనిచ్చిన తల్లి, రేర్‌ ఎర్త్‌, ఆర్‌.టి. ఐ చిత్రాలు ఎంపిక అయ్యాయి. స్పెషల్‌ జ్యూరీ విభాగంలో మైత్రి, ఒడి, భూమి, అణగారిన జీవితంలో అక్షర జ్యోతి, శ్వర నివాళి ఎంపిక అయ్యాయి. ఉత్తమ చిత్రాలకు 5 వేల రూపాయల నగదు బహుమతి, స్పెషల్‌ జ్యూరీ లో ఎన్నికయిన 5 చిత్రాలకు 1వెయ్యి రూపాయల చొప్పున నగదు బహుమతి అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రముఖ సినీ దర్శకులు బి.వీర శంకర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షార్ట్‌ ఫిలిం అనేది ఒక పవర్‌ఫుల్‌ మీడియా అలాంటి చిన్న సినిమాని చాలా ఉత్సాహంగా తమ సజనాత్మకతతో తీస్తున్న సజపరులైన వారందరికి అలాగే దాన్ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు తెలుగు సినిమా పరిశ్రమ తరఫున నేను కతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ రోజు ప్రదర్శించిన షార్ట్‌ ఫిలిమ్స్‌ ఉరకలేత్తిన యువకులే చాలా మంది చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేశారు. ఒక ప్రజానాట్యమండలి పునాదుల మీద ఏర్పడిన ఇలాంటి షార్ట్‌ఫిలిం సంస్థ ఆధ్వర్యంలో మంచిమంచి సినిమాలు తీసి ప్రదర్శిస్తున్న వారందరికీ తన ధన్యవాదాలు తెలియజేసారు. రామ్‌ భీమన 2011లో తీసిన సినిమా షార్ట్‌ ఫిలిం వల్లే కొన్ని మిలియన్‌ మంది చూసారు. అతనికి డైరెక్షన్‌ అవకాశం తీసుకొచ్చింది. విజయవాడలో మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం లాంటి అధ్భుతమైన ఆడిటోరియం ఉండటంకూడా ఫిలిం మేకర్స్‌కు ఎంతో ఉపయోగపడు తుందన్నారు. ఈ సంస్థ ఇక్కడ ఉన్న పెద్దలు అందరు కూడా వాళ్ళందరి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రముఖ సినీ దర్శకులు రామ్‌భీమన, దేవిప్రసాద్‌ తమ సందేశాలను పంపి అభినందనలు తెలియజేశారు. ఈ సభకు తెలుగు షార్ట్‌ ఫిల్మ్‌ గౌరవాధ్యక్షులు ఎడ్ల పార్థ సారది,ó కార్యదర్శి డి.వి.రాజు. అధ్యక్షులు బి.కె.ఎన్‌.ఎస్‌.ప్రసాద్‌, ఫిల్మ్‌ సొసైటీ అధ్యక్షులు గోళ్ళ నారాయణ రావు, ఎం.బి.వి.కే కార్యదర్శి పిన్నమనేని మురళీకష్ణ, తదితరులు పాల్గొన్నారు.