Jul 08,2021 13:30

తెలంగాణ : తెలంగాణలో షర్మిల ఏర్పాటు చేస్తున్న పార్టీకి స్వాగతం పలికారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. బేగంపేట ఎయిర్‌ పోర్ట్‌ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మరిన్ని పార్టీలు రావాలని, అవి ప్రజలకు మేలు చేసే పార్టీలుగా ఉండాలని కోరుతున్నానని ఆయన తెలిపారు. కొత్త రక్తం, చైతన్యంతో కూడిన యువత రాజకీయాల్లోకి రావాలని, రాజకీయ వారసత్వంతో సంబంధం లేని వారు కూడా రాజకీయాల్లోకి రావాలని అన్నారు.