Oct 22,2023 22:18

శ్రీవారిసేవలో ఏపీ రాష్ట్ర గవర్నర్‌ స్వర్ణరథంపై దేవదేవుడు

శ్రీవారిసేవలో ఏపీ రాష్ట్ర గవర్నర్‌
స్వర్ణరథంపై దేవదేవుడు
ప్రజాశక్తి- తిరుమల
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం 7.15 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప బంగారుతేరులో పయనిస్తూ, భక్తుల్ని తన కపాకటాక్షాలతో అనుగ్రహించాడు. మంగళవాయిద్యాల నడుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణరథన్ని లాగారు. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి దంపతులు, ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్‌ వెంకటరమణా రెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో సదా భార్గవి, సివిఎస్వో నరసింహ కిషోర్‌, సిఇ నాగేశ్వరరావు, ఎస్‌ఇ-2 జగదీశ్వర్‌రెడ్డి, విజివో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారిసేవలో ఏపీ రాష్ట్ర గవర్నర్‌
తిరుమల శ్రీవారిని ఆదివారం ఏపీ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టీటీడీ ఈవో ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, ఎవి.ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్‌ సాదరంగా అహ్వానించగా, అర్చక బందం 'ఇస్తికఫాల్‌' ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌, ఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని, 2024 టీటీడీ క్యాలెండర్లు డైరీలు అందించారు. డెప్యూటీ ఈవోలు లోకనాథం, విజివో బాలిరెడ్డి పాల్గొన్నారు.