Apr 08,2023 20:23

కూరగాయలు లారీ వద్ద దాతలు

మదనపల్లె అర్బన్‌ : శ్రీవారి నిత్యాన్నదానానికి శనివారం మదనపల్లి వారపుసంత కెజె మండి నిర్వాహకులు దాదాపీర్‌, ఖాజాపీర్‌ సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు టన్నుల కూరగాయలు పంపారు. ప్రతి నెలా అనవాయితీగా శ్రీవారి భక్తుల ఆకలి తీర్చడం కోసం టన్నుల కొద్ది కూరగాయలు పంపుతూ ఆదర్శంగా నిలచారు. పేదలు నివాసం వుండే ప్రాంతాల్లో ఉచితంగా కూరగాయలు పంపిణీ చేస్తూ వారివురు మానవత్వాన్ని చాటుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య అన్నదానానికి కెజె కాయగూరల మండి నిర్వహకులు దాదాపీర్‌, ఖాజాపీర్‌ ఏడు పర్యాయాలు కాయగూరలు, ఆకుకూరలు వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా దాదాపీర్‌ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిరోజు తిరుమలకు దేశంలోని నలుమూలల నుండి వేలాది మంది భక్తులకు నిత్య అన్నదానం కార్యక్రమంలో తాము భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. పవిత్ర రంజాన్‌ మాసంలో రైతు ఆకుల గోపాలకృష్ణతో కలసి కూరగాయలు పంపామన్నారు. కార్యక్రమంలో ఇమ్రోజ్‌ పీర్‌, గోపాలకృష్ణ, మస్తాన్‌, అయూబ్‌, రెడ్డిరామ్‌, ప్రసాద్‌, మస్తాన్‌, సర్దార్‌, గురు, లాల్‌, రాకా, మున్నా, అమీద్‌, దేవేందర్‌, చోటు, రాజు, లక్ష్మణ్‌, చందన్‌, మస్తాన్‌, మంజునాథ్‌ కుమార్‌, రాకేష్‌, చందన్‌, మున్నా, రేవంత్‌, గంగిరెడ్డి, గణేష్‌ సత్తార్‌, గురు, లాల్‌, రాఖా, మున్నా, అమిత్‌, దర్మేదర్‌, చోటు, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.