ప్రజాశక్తి-తాడిపత్రి ఆంధ్రభోజుడు శ్రీకష్ణ దేవరాయలు సేవలు మరువలేనివని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణంలోని శ్రీనివాసపురంలోని సిబి రోడ్డులో తాడిపత్రి బలిజ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు వేసిన కష్ణదేవరాయ విగ్రహాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ కష్ణదేవరాయలు తెలుగు భాషకు చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన నిర్మించిన అనేక దేవాలయాలు, చెరువులు నేటికీ అందరికీ ఉపయోగ పడుతున్నాయన్నారు. ఆయనను భావి తరాల వారు గుర్తుంచుకునే విధంగా తాడిపత్రి బలిజ సంఘం వారు విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి బలిజ సంఘం గౌరవాధ్యక్షులు శ్రీనివాసులు, అనంతపురం బలిజ సంఘం నాయకులు బళ్లారి వెంకట్రాముడు, శివయ్య, ప్రసాదు, విజయభాస్కర్, స్థానిక బలిజ సంఘం నాయకులు దద్దం సుబ్బరాయుడు, మదన్‌మోహన్ రావు, సుబ్రమణ్యం, మాధవ, పగడాల రామకష్ణ, ఓగేటి రంగస్వామి, మురళి, మాసులు లక్ష్మీప్రసాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు.










