Aug 19,2022 14:26

ప్రజాశక్తి-చందర్లపాడు : చందర్లపాడు గ్రామంలోని జగనన్న కాలనీలో యానాదుల ఇళ్ల నిర్మాణాలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం కింద మంజూరైన చెక్కులను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహనరావు శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత ఇల్లు లేని పేద వాళ్ళు ఉండకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలను ఆయా పంపిణీ చేయడంతో పాటు , సొంతగా ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం కూడా అందజేస్తూన్నారని , అంతేకాకుండా యానాదుల కు ప్రత్యేకంగా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు ప్రత్యేకంగా అదనపు ఆర్థిక సహాయం కూడా అందజేస్తూన్నారని తెలిపారు,ఎస్సీ -ఎస్టీ -బిసి- మైనారిటీ లైన -పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కస్తాల పున్నమ్మ , జడ్పిటిసి ముక్కపాటి నరసింహారావు,పార్టీ నాయకులు యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్ , వెలగపూడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.