మాట్లాడుతున్న చలంచర్ల భాస్కర్‌రెడ్డి
సర్ సి.వి.రామన్ సైన్స్ సెంటర్‌లో..జాతీయ సైన్స్ దినోత్సవం
నెల్లూరు:డా.జె డి ఆర్. ఎడ్యుకేషన ల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన సర్.సి.వి.రామన్ సైన్స్ సెంటర్ లో జాతీయ సైన్స్ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్.సి.వి.రామన్ విగ్రహానికి చలంచర్ల భాస్కర్ రెడ్డి పుష్ప మాలాలంకరణ గావించారు. తదుపరి సైన్సుదినోత్సవం ప్రాధాన్యత పై గౌస్ భాషా ప్రసంగించారు. చివరగా కన్వీనర్ కామయ్య సైన్స్ పై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ప్రజాశక్తి దినపత్రిక మేనేజర్ కె.కోటేశ్వరరావు హాజరైనారు. ఈ కార్యక్రమంలో కె.యన్.ఆర్. పాఠశాల బాలికలు ,ఉపాధ్యాయులు ,శ్రీ కష్ణ ,భోగేశ్వరావు ,సెక్రటరీ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
నగరపాలక ప్రాథమిక పాఠశాలలో..
కొండాయపాళెం లోని నగర పాలక ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సైన్స్ డే నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యం భాస్కర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు 40 ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శించారు. ఈ జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను జిఎస్‌టి అసిస్టెంట్ కమిషనర్ ఉషారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్ శాస్త్రీయ కషి పై సెమినార్లు ,చర్చలు నిర్వహించడం ద్వారా భారతదేశం అంతటా విద్యా సంస్థలు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకున్నాయన్నారు. రామన్ 94 సంవత్సరాల క్రితం 1928 లో ఇదే రోజున ప్రసిద్ధ రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాడు.1930 లో నోబెల్ బహుమతిని స్వీకరించారని, దీనిని పురస్కరించుకొని 1987 నుండి ప్రతిసంవత్సరం సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. విద్యార్థులకు చిన్నప్పటి నుంచీ పరిశీలించడం, పరిశోధకులు గా ఎదగాలని అన్నారు. అనంతరం ప్రాజెక్టులు తయారు చేయడం, ప్రదర్శించడంలో ప్రతిభను కనపరిచిన విద్యార్దులకు బహుమతులు అందజేశారు. ప్రముఖంగా వాటర్ రీ సైక్లింగ్ ప్రాజెక్ట్ చేసిన ఆదర్శ్ కు మొదటి బహుమతి, రెండవ బహుమతి బెలూన్ కారు చేసిన విష్ణు, మూడోవ బహుమతి రెయిన్ వాటర్ స్టోరేజ్ ప్రాజెక్ట్ చేసిన మనశ్వీ కి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హరీష్, సంధ్యారాణి,మాధవి వాలంటీర్లు పాల్గొన్నారు.
రామకృష్ణా ఆర్చిడ్ ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో..
విద్యార్థులలోని సజనాత్మకత వెలికి తీసేందుకు ఇటువంటి సైన్స్ షోలు ఎంతగానో దోహదపడతాయని నెహ్రూ యువకేంద్ర జిల్లా అధికారి ఆకుల మహేంద్ర రెడ్డి పేర్కొన్నారు. రామకష్ణ ఆర్చిడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు చేసిన సజనాత్మక ప్రయోగాలు ఎంతో అలరించాయి. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన శ్రీరామరాజు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ పేర్నపాటి శ్రీరామరాజు మాట్లాడుతూ సైన్స్ తో మనిషికి ప్రగతికి సాధించవచ్చునని తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వై. వి. పూర్ణ చంద్రరావు, కరెస్పాండెంట్ సి. శశిధర్, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె.మురళీమోహన్ రాజు, ప్రిన్సిపాల్ అతహర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










