Apr 19,2023 21:04

మాట్లాడుతున్న కలెక్టర్‌

మాట్లాడుతున్న కలెక్టర్‌
స్పందన కార్యక్రమం పటిష్టంగా అమలు
నెల్లూరు :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న స్పందన కార్యక్రమం జిల్లాలో పటిష్టంగా అమలయ్యేలా స్పందన పర్యవేక్షణ అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కలెక్టర్‌ యం. హరి నారాయణన్‌, అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌ లోని తన ఛాంబర్‌ లో కలెక్టర్‌ హరి నారాయణన్‌, అధికారులతో సమావేశమై జిల్లాలో స్పందన కార్యక్రమం అమలుతీరుపై సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారిచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్పందన కార్యక్రమానికి అందే అర్జీలు మళ్లీ మళ్లీ పునరావతం కాకుండా సంతప్తికర స్థాయిలో నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా స్పందన పర్యవేక్షణ బందం ప్రత్యేక దష్టి సారించాలన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చే దరఖాస్తు బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏ లోకి వెళ్లకుండా సంబంధిత శాఖ అధికారితో సమన్వయం చేసుకొని సంతప్తికర స్థాయిలో నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా స్పందన పర్యవేక్షణ బందం చర్యలు తీసుకోవాలన్నారు.
కొన్ని ప్రభుత్వశాఖల్లో పరిష్కరించిన అర్జీలు మరలా వస్తున్నాయని, అలాంటి అర్జీలపై ప్రత్యేక దష్టి సారించి సంబంధిత శాఖల అధికారులను పిలిపించి ధరఖాస్తుదారులు సంతప్తి చెందేలా ఆర్జీలను పరిష్కరించేందుకు స్పందన పర్యవేక్షణ బందం కషి చేసి రీ ఓపెండ్‌ ధరకాస్తులను తగ్గించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. స్పందనలో వచ్చే అర్జీలలో ఆర్థిక, ఆర్ధికేతర అంశాల వారీగా విశ్లేషణ చేసుకుని, ఆమేరకు పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. స్పందనలో పెండింగ్‌ లో వున్న అర్జీలపై ప్రత్యేక దష్టి సారించి సంతప్తికర స్థాయిలో నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. సచివాలయాల్లో అందించే సర్వీసెస్‌ పై ప్రత్యేక దష్టి సారించి లక్ష్యం మేరకు ప్రగతి సాధించేలా అధికారులు శ్రద్ద తీసుకోవాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి సంబంధించి పెండింగ్లో వున్న ముఖ చిత్ర హాజరు , రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్‌, అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంచార్జి జిల్లా రెవిన్యూ అధికారి పద్మావతి, జడ్పీ సీఈవో బి.చిరంజీవి, సి.పి.ఓ ఎస్‌. రాజు, స్పందన పర్యవేక్షణ అధికారులు తదితరులు పాల్గొన్నారు