- ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ మిచెల్
న్యూఢిల్లీ : పెగాసస్, కాండిరు వంటి స్పైవేర్ల వినియోగం ఆమోదనీయం కాదని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషనర్ మిచెల్ బచ్చేలెట్ స్పష్టం చేశారు. అటువంటి స్పైవేర్‌ను ప్రభుత్వాలు వినియోగించడం హద్దు మీరడం కిందకు పెగాసస్ స్పైవేర్ ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఫోన్ నంబర్లపై నిఘా వేసిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో బచ్చెలెట్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాజాగా ఆమె ఒక సందర్భంగా మాట్లాడుతూ స్పైవేర్లు ప్రజల ఫోన్లలోకి అక్రమంగా ప్రవేశిస్తాయని, ఫలితంగా వారి జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. తీవ్రమైన నేరాలు, భద్రతాపరమైన బెదిరింపుల నేపథ్యంలోనే వాటిని వినియోగించడం సమర్థనీయం అవుతుందని పేర్కొన్నారు.










