ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల సచివాలయ సిబ్బందికి మత్తు పదార్థాలు, సోషల్‌మీడియా దుర్వినియోగంపై వర్క్‌షాప్ శుక్రవారం నిర్వహించారు. నవజీవన్ బాలభవన్ ప్రోగ్రాం మేనేజర్ గోళ్ళమూడి శేఖర్‌బాబు మాట్లాడుతూ మత్తు పదార్థాల దుర్వినియోగం క్రమంగా ఒక ప్రజారోగ్య సమస్యగా మారుతోందన్నారు. వీటికి అలవాటు పడిన విద్యార్థులు యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులవుతున్నారన్నారు. సమాజం ఆధునాతన జీవనశైలికి అలవడుతున్న కారణంగా ప్రతిఒక్కరు ఈ మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారన్నారు. సోషల్‌మీడియాకు ఒకసారి బానిసలైన తర్వాత దీని కోసం ఎంతటి ఆకృత్యాలు నేరాలు చేయడానికి వెనకాడని పరిస్థితి ఉంటుందన్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఉపయోగించాలనే అతి నియంత్రిత కోరికతో ఎక్కువ సమయం కేటాయించడంతో మెదడుపై తీవ్ర ప్రభావం వల్ల శారీరకంగానూ మానసికంగానూ ప్రభావం చూపిస్తుం దన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం పట్టణ ఆరోగ్య కేంద్రం డాక్టర్ డి ప్రితీ, నవజీవన్ బాల భవన్ జోనల్ కో ఆర్డినేటర్ కె ప్రియాంక, జె ఆంజనేయులు, ఇబ్రహీంపట్నం పంచాయితీ సెక్రటరీ యాన్ హెచ్ సుస్మిత తదితరులు పాల్గొన్నారు










