సోమిరెడ్డికి శుభకాంక్షలు తెలుపుతున్న దృశ్యం
ప్రజాశక్తి-నెల్లూరు :మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె.మురళీమోహన్‌రాజు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం అల్లీపురం లోని నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి శాలువాను కప్పి నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల కాలంలో టిడిపి పార్టీలో చేరిన మురళీమోహన్ రాజును పార్టీ అభివద్ధికోసం కషి చేయాలని సోమిరెడ్డి కోరారు బీసీ.సాధికార ముదిరాజ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ పి.ఎల్.రావు, కోవూరు నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సోమ గోపాల్ పాల్గొన్నారు.










