Jul 20,2021 16:14

అమరావతి : సంగం డెయిరీ కేసులో టిడిపి నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఎపి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు విజయవాడ మున్సిపల్‌ పరిధిలోనే ఉండాలని తెలిపింది. విజయవాడలో ఎక్కడ ఉంటున్నారో ఇంటి అడ్రస్‌ కోర్టుకు తెలపాలని, ఎసిబి విచారణకు పూర్తిగా సహకరించాలని పేర్కొంది. విచారణకు ఎసిబి ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని ఆదేశించింది. సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల నరేంద్ర ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే.