మాట్లాడుతున్న జెడ్‌పి చైర్మన్ ఆనం అరుణమ్మ
సమసమాజ స్థాపన దిశగా అడుగులు
నెల్లూరు :రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష హౌదాలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సుదీర్ఘమైన పాదయాత్రల్లో ప్రజలకు చేసిన హామీలు అమలు చేస్తూ సమసమాజ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నారని జెడ్‌పి చైర్మన్ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. శనివారం నగరంలోని వైసిపి జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీ అయిన 18 శాసన మండలి స్థానాలల్లో ఎస్‌సిలకు రెండు, ఎస్‌టిలకు ఒకటి, బిసిలకు 11, ఓసిలకు 4 కేటాయించి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నారన్నారు. అదేవిధంగా, మహిళా సాధికారతకు పెద్ద పీట వేయాలన్న దక్పధంతో, స్థానిక సంస్థలలో మహిళలకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లుగా, మండల ఉపాధ్యక్షులుగా , పురపాలక సంస్థ మేయర్లుగా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వారిని సమాజంలో మహిళలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారన్నారు. వీటితో పాటుగా, సంక్షేమ పథకాలలో కూడా మహిళకు ప్రాధాన్యం ఇచ్చుట ద్వారా, వారి కుటుంబాల ఆర్ధిక పరిపుష్టికి చేయూత నిచ్చారన్నారు. ఈ విధంగా, మన రాష్ట సర్వతో ముఖాభివద్దికి శ్రమిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులకు ఈ సందర్భంలో కతజ్ఞతలు తెలుపుకొంటున్నామన్నారు. చివరగా జిల్లా స్థానిక సంస్థలకు శాసన మండలి సభ్యులుగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్స్ పార్టీ తరపున ఏకగ్రీవంగా ఎన్నికయిన మేరిగ మురళి జెడ్‌పి చైర్మన్, జిల్లా ప్రజా పరిషత్ సభ్యులు అభినందనలు తెలియజేశారు.










