Nov 20,2020 23:37

తాడికొండలో మాట్లాడుతున్న లక్ష్మీనారాయణ, సత్తెనపల్లిలో సమ్మె నోటీసు ఇస్తున్న భోజన పథకం కార్మికులు

26న సమ్మె జయప్రదానికి కదులుతున్న స్కీమ్‌వర్కర్లు, కార్మికులు, ఉద్యోగులు
ప్రజాశక్తి - గుంటూరు జిల్లా విలేకర్లు : కార్మికులు, కర్షకులు, ఇతర అన్ని రంగాల ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మొపుతున్న భారాలు, అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 26న కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో సమ్మె జయప్రదానికి జిల్లా వ్యాప్తంగా రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, సమ్మె నోటీసులు, ఇతర రూపాల్లో ప్రచారాలు చేపట్టాయి.
శుక్రవారం పాత గుంటూరు లోని సిఐటియు కార్యాలయంలో రౌండ్‌టేబుల్‌ సమావేశానికి గుంటూరు నగర ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌(సిఐటియు) ప్రధాన కార్యదర్శి షేక్‌.మస్తాన్‌వలి అధ్యక్షత వహించగా ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నన్నపనేని శివాజీ, సిఐటియు నగర తూర్పు ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ఐఎఫ్‌టియు నగర కార్యదర్శి కృష్ణ మాట్లాడారు. పోస్టల్‌, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ తదతర రంగాల్లో ప్రచారం చేపట్టగా బ్యాంకు ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర నాయకులు ఎం.సాంబశివరావు, ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యదర్శి ఎన్‌.బంగారుబాబు మాట్లాడారు. ఆటో నగర్‌లో సిఐటియు నాయకులతో కలిసి కార్మికులు సమ్మె నోటీసులు అందచేశారు. 3వ డివిజన్‌లోని పారిశుధ్య కార్మికుల మస్టర్‌ ఆఫీసు వద్ద ది గుంటూరు జిల్లా మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) సమావేశంలో జిల్లా అధ్యక్షులు బి.ముత్యాలరావు, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పేటేటి యాకోబు మాట్లాడారు. ప్రత్తిపాడులో వివిధ రంగాల కార్మికులతో నిర్వహించిన సమావేశంలో సిఐటియు తూర్పు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నాగేశ్వరరావు మాట్లాడారు. మంగళగిరిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు ఇచ్చారు. సిఐటియు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సత్తెనపల్లి ఎంఇఒకు మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. స్థానిక సుందరయ్య విజ్ఞానకేంద్రంలో కార్మిక ప్రజా సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం.హరిపోతురాజు అధ్యక్షత వహించగా పశ్చిమ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయకుమార్‌, ఎఐటియుసి ఏరియా అధ్యక్షులు కె.శ్రీనివాస్‌, రైతు సంఘం పశ్చిమ గుంటూరు జిల్లా జిల్లా అధ్యక్షులు గద్దె చలమయ్య మాట్లాడారు. గ్రోమోర్‌ సెంటర్‌లో భవన నిర్మాణ కార్మికులు ప్రచారం చేశారు. తాడేపల్లి పట్టణం ఉండవల్లి సెంటర్‌లో పారిశుధ్య కార్మికుల సమావేశంలో సిఐటియు రాజధాని డివిజన్‌ అధ్యక్షులు ఎం.రవి మాట్లాడారు. తాడేపల్లి రూరల్‌ కుంచనపల్లిలోని పంచాయతీ కార్యాలయం వద్ద సిఐటియు సమావేశం నిర్వహించింది. వేమూరు, కొల్లూరు మండలాల్లో వివిధ సంఘాల సమావేశం నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆల్‌ యూనివర్సిటీస్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌, దినసరి కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కమిటీ ఆధ్వర్యంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ కె.రోశయ్యకు సమ్మె నోటీసు ఇచ్చారు. బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం పిహెచ్‌సి వైద్యాధికారికి ఆశావర్కర్లు సమ్మె నోటీసు ఇచ్చారు. తాడికొండలో నిర్వహించిన సమావేశంలో సిఐటియు, రైతు సంఘాల తూర్పు గుంటూరు జిల్లా అధ్యక్షులు డి.లకీëనారాయణ, కె.అజరుకుమార్‌ మాట్లాడారు. నరసరావుపేటలో ఆశా వర్కర్లు సమ్మె నోటీసు ఇచ్చారు. చిలకలూరిపేటలోని సిపిఐ కార్యాలయంలో కార్మిక సంఘాల సమావేశం నిర్వహించగా ఎఐటియుసి జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడారు. పిడుగురాళ్లలో స్కీమ్‌ వర్కర్లు, ఇతర రంగాల కార్మికులు అధికారులకు, యాజమా న్యాలకు సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు ఇచ్చారు. ముప్పాళ్లలో నిర్వహించిన సిఐటియు సమావేశంలో పశ్చిమ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి విజరుకుమార్‌ మాట్లాడారు. రేపల్లెలో నిర్వహించిన సమావేశంలో సిఐటియు డివిజన్‌ కార్యదర్శి సిహెచ్‌ మణిలాల్‌ మాట్లాడారు. గాంధీనగర్‌లో నిర్వహించిన సమావేశంలో అఖిలభారత రైతు కూలి సంఘ జిల్లా కార్యదర్శి మేకల ప్రసాద్‌ మాట్లాడారు.