ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : జిల్లా కలెక్టర్‌గా వివేక్ యాదవ్ గురువారం ఉద్యోగ బాధ్యతలు బాధ్యతలు స్వీకరించారు. వివేక్‌యాదవ్‌ను జాయింట్ కలెక్టర్‌లు ఎ.ఎస్.దినేష్‌కుమార్, పి.ప్రశాంతి, కె.శ్రీధరరెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి సి.చంద్రశేఖర్ రెడ్డి పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. నగర కమిషనర్ పి.అనూరాధ,కలెక్టరేట్ ఎ.ఓ మల్లికార్జునరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ను కలసి పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.










