Feb 27,2023 21:36

ఫొటో : నిరసన వ్యక్తం చేస్తున్న సిపిఎం నాయకులు

సమగ్ర విచారణ జరపాలి
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : మండలంలోని కొత్తూరు మహిళ బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలపై జరిగే విచారణ ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా సమగ్రంగా విచారణ జరిపి నివేదికను కలెక్టర్‌ అందజేయాలని జిల్లా సిఐటియు అధ్యక్షులు టివివి ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం సిపిఎం నేతల ఆధ్వర్యంలో మహిళా బ్యాంకు వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా బ్యాంక్లో విచారణ సమగ్రంగా జరిపి పేద మహిళలకు న్యాయం చేయాలన్నారు. పేదలకు సంబంధించిన ఆర్థిక విషయంలో ఎటువంటి రాజకీయ కుట్రలు చేయొద్దంటూ నిరసన చేపట్టారు. ప్రధానమైన నిందితులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
అవినీతి సొమ్మును రాబట్టి బాధితులకు అందజేయాలన్నారు.  జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకొని సమగ్ర విచారణ జరిపి అన్యాయం జరిగిన మహిళలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, లీగల్‌ అడ్వైజర్‌ శ్యామ్‌రెడ్డి, యువజన నాయకులు చీమకుర్తి శ్రీనివాసులు రెడ్డి, బండ్ల నారాయణ, శరత్‌, వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.