Apr 18,2023 20:59

శిశుగృహాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

శిశుగృహాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌
శిశు గహ, బాలసదనాన్ని సందర్శించిన కలెక్టర్‌
నెల్లూరు:నగరంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం సమీపంలో గల అనాధ బాలల సంరక్షణ కేంద్రం శిశు గహ, బాలల సదనం లను మంగళవారం కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ సందర్శించారు. శిశు గహలోని చిన్నారుల యోగక్షేమాలను సంరక్షకులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. వంటశాలను తనిఖీ చేశారు. చిన్నారులకు సకాలంలో పాలు, ఆహార పదార్థాలు అందించాలని, నిర్దేశించిన సమయంలోపు అన్ని వ్యాక్సిన్‌ లను వేయాలని సిబ్బందికి సూచించారు. అలాగే బాలల సదనమును సందర్శించిన కలెక్టర్‌, అక్కడ మరుగుదొడ్లను, వంటశాల, పరిసర ప్రాంతాలను పరిశీలించారు
. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చిన్నారులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా మెరుగైన సేవలు అందించాలని, ఎటువంటి సమస్య వచ్చినా తన దష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. కలెక్టర్‌ వెంట ఐసిడిఎస్‌ పిడి సౌజన్య, ఏసిడిపిఓ అనురాధ, డిసిపిఓ సురేష్‌, బాలల సంరక్షణ అధికారి సమత, మేనేజర్‌ లక్ష్మి, సూపరింటెండెంట్‌ లక్ష్మి తదితరులు ఉన్నారు.
మాట్లాడుతున్న కలెక్టర్‌