ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు వాహనసేవ జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారు వేణుగాన అలంకారంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం 8 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఇఒ నటేష్ బాబు, డిఎఫ్‌ఒ శ్రీనివాస్, గోపాలరావు, సూపరింటెండెంట్లు పి.వెంకటేశయ్య, ఆర్సీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ పాల్గొన్నారు.
వటపత్రశాయి అలంకారం దర్శనమిచ్చిన సీతారాముడు
ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారు వట పత్రశాయి అలంకారంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శన మిచ్చారు. ఉదయం 8 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కబ óజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామి వారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించు కున్నారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చంద నంతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇఒ నటేష్ బాబు, ఎఇఒ గోపాలరావు, సూపరింటెండెంట్లు పి.వెంక టేశయ్య, ఆర్‌సి సుబ్రహ్మణ్యం, టెంబపుల్ ఇన్‌స్పెక్టర్ ధనుంజయ పాల్గొన్నారు.










