Jul 08,2021 10:52

అనంతపురం : రాయదుర్గంలో సీఎం పర్యటన సందర్భంగా ముందస్తు చర్యలో భాగంగా ఎస్‌ఐ రాఘవేంద్రప్ప ఆధ్వర్యంలో స్థానిక సిపిఎం కార్యాలయం నందు సిపిఎం నాయకులను అరెస్ట్‌ చేశారు. అరెస్టు చేసిన వారిలో సిపిఎం డివిజన్‌ కార్యదర్శి బి మల్లికార్జున, జిల్లా కమిటీ సభ్యులు ఎన్‌ నాగరాజు, సిపిఎం డివిజన్‌ కమిటీ సభ్యులు జి. మధు, ఎస్‌ రమేష్‌ లు ఉన్నారు. అంతేకాకుండా ఉద్యోగాల భర్తీకై పోరాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులను కూడా నిన్న అర్థరాత్రి అక్రమంగా అరెస్ట్‌ చేసి కణేకల్లు పోలీసు స్టేషన్‌ లో నిర్భందించారు. ఈ అరెస్టులను తీర్వంగా ఖండిస్తున్నామని నాయకులు తెలిపారు.

సిఎం పర్యటన నేపథ్యంలో సిపిఎం నేతల అరెస్ట్‌లు