ప్రజాశక్తి - వన్‌టౌన్
విజయవాడ నగరంలో ఉన్నా ప్రవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు ప్రభుత్వ నిబంధనలు పాటించ కుండా రెండో శనివారం కూడా విద్యార్థులకు తరగతులు నిర్వహించడం ఏమిటని ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎం.సోమేశ్వరరావు ప్రశ్నించారు. ఆయా పాఠశాలల వద్ద శనివారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరరసన తెలిపారు. ఈ సందర్భంగా సోమేశ్వరరావు మాట్లాడుతూ సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో రెండో శనివారం క్లాసులు నిర్వహిస్తున్నా ఆ పాఠశాలులపై విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. విద్యార్థులను తరగతులు పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థలు మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా తరగతులు నిర్వహించే విద్యాసంస్థలు దగ్గరకు వెళ్లి విద్యార్థులును బయటకు పంపించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు భార్గవ్ పాల్గొన్నారు.










