'సేవియర్స్' ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణ, పరిసర ప్రాంతాలలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సేవియర్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కావలి టౌన్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ రెడ్‌క్రాస్ భవనంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కావలి వ్యాప్తంగా 17 స్కూళ్ల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కావలి డిఎస్‌పి వెంకటరమణ, ప్రముఖ హిందీ పండట్ కళ్యాణి హాజరయ్యారు. విజేతలకు బహుమతులు, ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను డిఎస్‌పి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి పట్టణస్థాయి క్విజ్, కాంపిటీషన్ నిర్వహించిన సేవియిర్స్ సభ్యులకు, విజేతలకు శుభాభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో సేవియర్ సభ్యులు మాధురి, కీర్తి, దీపిక, నవ్య, మాన్య జాహ్నవి, స్వాతి, బిల్వని, మవ్య హర్ష, వినీల్, రమణ్, శ్రీను, కౌశిక్, భార్గవ్, నాగేంద్ర, పవన్ సాయి, రాజేష్, సంతోష్, నవీన్, తరుణ్, కౌషిక్, సుజిత్, పవన్ కుమార్, షణ్ముఖ, మనీష్, ఉమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.










