Apr 28,2023 22:09

ఫొటో : రికార్డులు పరిశీలిస్తున్న తహశీల్దారు అబ్దుల్‌హమీద్‌

సచివాలయంలో తహశీల్దారు తనిఖీ
ప్రజాశక్తిబీ-వరికుంటపాడు : మండలంలోని తోటల చెరువుపల్లి సచివాలయాన్ని శుక్రవారం తహశీల్దార్‌ అబ్దుల్‌ హమీద్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సచివాలయంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందజేశారు.
తహశీల్దార్‌ మాట్లాడుతూ సచివాలయం వచ్చే ప్రజలపై సచివాలయ సిబ్బంది గౌరవ మర్యాదలు కలిగి ఉండాలని వారికి సంబంధించిన పనులు సకాలంలో పూర్తయ్యేలాగా చూడాలని కోరారు. సమయపాలనలో ప్రతి ఉద్యోగి సచివాలయానికి హాజరుకావాలన్నారు. కార్యక్రమంలో విఆర్‌ఒ కొండయ్య, పంచాయతీ కార్యదర్శి సంపూర్ణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.