Feb 26,2023 21:28

ఫొటో : మాట్లాడుతున్న జెవివి నాయకులు

సైన్స్‌ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి
ప్రజాశక్తి-కావలి : జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో 28న జరుగనున్న జాతీయ సైన్స్‌ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని జెవివి పట్టణ అధ్యక్ష, గౌరవాధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు, డాక్టర్‌ బి.రవికుమార్‌ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని రవి నర్సింగ్‌ హోమ్‌లో ప్రెస్‌ మీటింగ్‌ నిర్వహించి మాట్లాడారు. పట్టణంలోని రెడ్‌క్రాస్‌ భవనంలో గతవారం రోజులుగా సైన్స్‌ వారోత్సవాలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఇందులో వ్యాసరచన, వక్తృత్వం, నృత్యాలు, పాటలు, చిత్రలేఖనం, క్విజ్‌ తదితర పోటీలను నిర్వహించామన్నారు.
అన్ని అంశాలలో 30 స్కూల్స్‌ నుండి 150 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. అదేవిధంగా ఫిబ్రవరి 28వ తేదీన జరిగే 7వ అంశమైన వైజ్ఞానిక ప్రదర్శన, విద్యార్థులు సైంటిఫిక్‌ విచిత్ర వేషధారణ ప్రదర్శనలు అత్యంత వైభవంగా నిర్వహించి, అదే రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశంలో విజేతలకు మెమెంటోస్‌, సర్టిఫికెట్స్‌, జెవివి పుస్తకాలు బహుమతి ప్రదానం చేస్తామని తెలియజేశారు. కావలి పట్టణంలో జన విజ్ఞాన వేదిక గతవైభవాన్ని పునర్నిర్మించ దలచి, ఈ సైన్స్‌ వారోత్సవాలు జరుగుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. పట్టణంలోని స్కూలు యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు, కావలి పట్టణ జనవిజ్ఞానవేదికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. జె.వి.వి. ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28వ తేదీన సాయంత్రం 4 గంటలకు రెడ్‌క్రాస్‌ భవనంలో జరిగే జాతీయ సైన్స్‌ దినోత్సవానికి అందరూ ఆహ్వానితులని తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పాపిశెట్టి.జానకిరామ్‌, కందికట్టు.నారాయణ, సహాయ కార్యదర్శులు ఖాదర్‌బాషా, జి.కళ్యాణి, కార్యవర్గ సభ్యులు హరీశ్చంద్రారెడ్డి, రఫీ, కె.జాన్‌, విశ్రాంత ఎం.ఇ.ఒ. కల్లయ్య, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.