Dec 17,2022 19:25

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ గిరీష
ప్రజాశక్తి - రాయచోటి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంలో భాగంగా జిల్లాలో 471 రెవిన్యూ గ్రామాలకు గాను మొదటి విడత రీసర్వేలో భాగంగా ఇప్పటి వరకు 66 గ్రామాలలో రీ సర్వే పూర్తయిందని కలెక్టర్‌ గిరీష తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష కార్యక్రమంపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రీసర్వే పూర్తయిన 66 గ్రామాలకు గాను, నేటి వరకు మూడు రెవెన్యూ డివిజన్లలోని 39 గ్రామాల్లో 4100 పైచిలుకు భూ యజమానులకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేశామన్నారు. మరో 10 వేలకుపైగా భూ హక్కు పత్రాలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. రైతులు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా వందేళ్ళ తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రీసర్వేలో భాగంగా సుదీర్ఘ కాలంగా అపరిష్కతంగా వున్న హద్దు తగాదాలు, భూమిపై హక్కు కలిగిన వారసుల యొక్క పేర్లు, భూ రికార్డుల్లో నమోదు చేసుకోని సాగుదారులను భూరికార్డుల్లో నమోదు చేయడం వంటి చాలా సమస్యలు రెవెన్యూ, సర్వే శాఖలు పరిష్కారం చేశాయన్నారు. జిల్లాలోని రైతులు, భూయజమానులు రీసర్వే సమయంలో అధికారులకు సహకరించాలన్నారు. జిల్లాలో భూములు ఉండి ఇతర ప్రాంతాలలో, నగరాల్లో ఉన్న ఎవరైనా రైతులందరూ తమ వద్ద ఉన్న భూ సంబంధిత ధ్రువపత్రాలను, హక్కు పత్రాలు తీసుకుని వచ్చి ఇస్తే వారికి రీ సర్వే భూ హక్కు పత్రాలు అందజేస్తామని తెలిపారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో హక్కు నమోదు ప్రక్రియలో ఏవైనా తప్పులు దొర్లినా కూడా ఆంధ్రప్రదేశ్‌ భూ హక్కుల నమోదు చట్టం 1971, సెక్షన్‌ 3 సబ్‌ సెక్షన్‌ (3) ప్రకారం హక్కుదారులు సంవత్సరం లోపల తహశీల్దారుకు సంబంధిత హక్కు పత్రాలతో హాజరైన వారి హక్కులను భూ రికార్డుల్లో నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. భూములకు సంబంధించి ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా రే సర్వే వల్ల పరిష్కారం అవుతాయన్నారు. వారసత్వ భూ ఆస్తులు, అన్నదమ్ములు ఉమ్మడిగా ఉండి ఇంకా డివిజన్‌ చేసుకొని వారు, ఖాతా నెంబరు, ఎల్పిఎం నెంబరు తదితరాలు లేని వారందరూ సర్వే చేస్తున్న అధికారుల ఎదుట హాజరై తగిన పత్రాలు సమర్పించి తమ తమ పేర్లతో డివిజన్‌ చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నామన్నారు. చాలా మందికి రీసర్వే పై అవగాహన లేదున్నారు. రైతులకు విజ్ఞప్తి చేయడమేమంటే వారు భూమి మీద అనుభవంలో ఉంటారున్నారు. తల్లిదండ్రులు నుంచి వచ్చే ఆస్తులను అన్నదమ్ముల మధ్య డివిజన్‌, పార్టిషన్‌ చేసుకొని ఎలాంటి అగ్రిమెంట్‌, పత్రాలు లేకుండా కూడా ఉంటారు. అలాగే చాలావరకు నోషనల్‌ ఖాతా, ఎల్పీఎమ్‌ ఖాతా నెంబర్‌ లేకుండా కొనసాగుతూ ఉంటారున్నారు. రీ సర్వే ద్వారా వారికి ఎల్పిఎం, ఖాతా నెంబర్‌ ఇస్తామన్నారు. ఈ చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయిన్నారు. రీసర్వేకి ఒక మేజర్‌ గైడ్‌ లైన్‌, మేజర్‌ ఆబ్జెక్టివ్‌ ఏముంటే ఎవరు ఎంత భూమి ఉందో అంత భూమికి వారికి హక్కు ఉంటుందిన్నారు. ఎక్కడైనా వచ్చినా అది పాయింట్‌ 01 శాతం మాత్రమే ఉందని, అధికారికంగా భూహక్కు పత్రాలను జారీ చేస్తున్నందున ఇబ్బందులు ఏర్పడని విలేకరుల అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. భూమికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేని వారికి సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో కానీ, అడంగల్‌ కానీ, రెవిన్యూ రికార్డులు కానీ ఏదో ఒక పత్రం ఇచ్చి ఉంటారున్నారు. భూమి పైన హక్కు ఉందని వారి వద్ద ఉన్న డాక్యుమెంట్‌ ఏదైనా తీసుకుని వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాంన్నారు. వారసత్వ భూములు, పట్టా ల్యాండ్‌ ఉండి ఎలాంటి రికార్డు లేని వారి విషయంలో రెవిన్యూ రికార్డుల్లో పేర్లు ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది రాదున్నారు. రెవెన్యూ రికార్డుల్లో లేకుండా భూమి అనుభవంలో ఉన్నామని తెలిపినప్పుడు మాత్రమే భూ హక్కురికార్డులు అవసరం అవుతాయినరు. పట్టా ల్యాండ్‌ అయ్యుండి అనుభవములో ఉండి ఎటువంటి రికార్డులు లేకున్నప్పుడు రెవిన్యూ రికార్డుల్లో సదరు పట్టా పరిశీలించి పేర్లు ఉన్నప్పుడు తగిన చర్యలు తీసుకుంటామున్నారు. రాయచోటి పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, కొత్త కలెక్టరేట్‌ పవన నిర్మాణం, శిల్పారామం, నగరవనం, పార్కులు, సెంట్రల్‌ మీడియన్‌ తదితరాల ఏర్పాటు కూడా వేగవంతంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.