Apr 19,2023 20:57

మాట్లాడుత్ను సిపిఎం నాయకులు

మాట్లాడుత్ను సిపిఎం నాయకులు
సామాన్యులపై మోయలేని భారం
కోవూరు:మండలంలోని పోతిరెడ్డిపాలెంలోని శ్రీవాణి కాలనీ, వారాధి సెంటర్‌, పల్లిపాలెం, తిప్ప, అంబేద్కర్‌ సెంటర్‌, చద్రశేఖర్‌ పురంలలో ప్రచార భేరి కార్యక్రమం జరిగింది. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గండవరపు శేషయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై అధికభారాలు మోపడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దేశమంతటా ఒకే పన్ను విధానం అని చెప్పిన మోడీ కేంద్రంప్రభుత్వం జిఎస్‌టి పరిధిలోకి డీజిల్‌, పెట్రోల్‌ ఎందుకు చేర్చలేదని రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిత్యావసర సరుకులు ధరలుపెరిగి ఆకాశాన్నంటుతున్నాయన్నారు. రూ.450 ఉన్న గ్యాస్‌ బండ రూ.1180కి పెంచిన ఘనత బిజెపికి దక్కుతుందన్నారు.
మోటార్లకు మీటర్లు బిగించి దేశంలోనే మనరాష్ట్ర రైతుల మెడకు ఉడితాడు కడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రుణాంద్రప్రదేశ్‌ గా మారిందన్నారు. రాబోవు రోజుల్లో భావితరాలు బతకాలంటే భారాలు వేసి మోసే ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. వామపక్షాలు ప్రజల కు అండగ ఉండి ప్రజా పోరునడపాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌కె బాబు, రమణయ్య, రమేష్‌, అన్వర్‌, ఖాదర్‌బాషా, పెద్దబ్బయ్య, భాస్కర్‌, శివ, విజరు కుమార్‌, సురేష్‌, వెంకటేష్‌, మణి, మోహన్‌, రత్నమ్మ, హసీనా , ఫాతిమా పెంచలమ్మ, గౌసియాలు పాల్గొన్నారు.