Oct 13,2023 11:44

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : అతివేగం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. గుంటూరు జిల్లా బ్రాహ్మణపల్లి ఎక్స్ రోడ్డు వద్ద బైక్ ను లారీ ఢీకొన్నడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. చిన్నారి లక్ష్మీ తేజస్విని (6)తో పాటు సంపూర్ణ అనే మహిళ కూడా మరణించింది. పిడుగురాళ్ల మండలం న్యూ వెళ్ళంపల్లికి చెందిన పోతురాజు.వెంకటేశ్వర్లు తన చిన్న కూతురైన హర్షితకు(2) టైఫాయిడ్ జ్వరంగా ఉండడంతో ఇంజక్షన్ వేయించుటకు గాను బ్రాహ్మణపల్లికి బయలుదేరారు. తనతో పాటు తన పెద్ద కూతురు లక్ష్మీ తేజస్విని తీసుకుని వెళ్తుండగా, వరుసకు అక్క అయిన కారుకోళ్ల.సంపూర్ణ తను పొలం పని నిమిత్తం వెళ్తూ వారితో కలిసి పయనం అయ్యారు. బ్రాహ్మణపల్లి ఎక్స్ రోడ్డు దగ్గర  వెనక నుంచి వస్తున్న లారీ అజాగ్రత్తగా అతివేగంగా నడుపుతూ బైక్ ని ఢీ కొట్టడం వలన కారుకోళ్ల.సంపూర్ణ మరియు పోతురాజు.లక్ష్మీ తేజస్విని ఇద్దరు కూడా సంఘటన స్థలంలోనే మృతి చెందారు.   చిన్న పాప హర్షితకు చిన్నచిన్న గాయాలు తగలగా ప్రధమ చికిత్స చేయిస్తున్నారు. పిడుగురాళ్ల సిఐ ఆంజనేయులు,  పిడుగురాళ్ల రూరల్ ఎస్సై రబ్బానీ ఖాన్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.