- కమిటీకి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ నేతృత్వం
- సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్ వెల్లడి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సుప్రీం కోర్టులో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కమిటీ ఏర్పాటు చేశారు. జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ నేతృత్వం వహించే ఈ కమిటీలో ఆయనతో పాటు ఆరుగురు సభ్యులు ఉంటారు. ''సుప్రీం కోర్టు కమిటీ ఆన్ యాక్సెసిబిలిటీ'' అని పిలిచే కమిటీ సుప్రీం కోర్టు ప్రాంగణంలో సమగ్ర యాక్సెసిబిలిటీ ఆడిట్ నిర్వహించే బాధ్యతను నిర్వహిస్తోంది. ఆడిట్ సాంకేతిక, భౌతిక యాక్సెసిబిలిటీ విస్తరిస్తుంది. సుప్రీం కోర్టు ప్రాంగణానిు సంద ర్శించే వికలాంగులు, వారు ఎదుర్కొంటున్న స'మస్యల స్వభావం, పరిధిని అంచనా వేయడానికి వికలాంగుల కోసం ప్రశాువళిని సిద్ధం చేసి విడుదల చేసే బాధ్యత కూడా కమిటీకి అప్పగించారు. కమిటీలో బెంగళూర్ ఎన్‌ఎల్‌ఎస్‌ఐయు ప్రొఫెసర్, సుప్రీం కోర్టులో పనిచేసే వికలాంగు ఉద్యోగి, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ నామినేట్ చేయబడిన వికలాంగు న్యాయవాది, నల్సార్ యూనివర్శిటీలోని సెంటర్ ఫర్ సెబిలిటీ స్టడీస్ నామిటీ స్టడీస్ చేసే. కమిటీకి సభ్య కార్యదర్శిగా సుప్రీం కోర్టు రిజిస్ట్రీ అధికారి ఉంటారు. కమిటీ సుప్రీం కోర్టు న్యాయవాదులు, ఇతరులు నుండి కూడా సమస్యలను సేకరిస్తుందని, ఈ సమస్యలను తొలగించే దిశగా ప్రతిపాదనలను సిఫారసు చేసిననిసుప్రీం కోర్టు ప్రకటనలో ప్రసారం చేసింది.










