రోడ్డుమీద పడేసిన జగనన్న చిక్కి
ప్రజాశక్తి రొద్దం: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పిల్లలకు పౌష్టికాహారం అందించాలని ఉద్దేశంతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న జగనన్న చిక్కి రొద్దం మండలంలో రోడ్డుపాలైంది. బుధవారం మండలంలోని చెరుకూరు చెరువు కట్ట కింద రోడ్డుపై జగనన్న చిక్కిని పడేశారు.










