ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
తూర్పు గోదావరి జిల్లా కూనవరం మండలం పొట్లవైగుడెం గ్రామం ప్రజలు పూర్తిగా ముంపుకు గురైన గ్రామాలకు శాశ్వత పునరావాసం కల్పించాలని గురువారం రాస్తారోకో చేశారు. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు రహదారిపై అడ్డుగా నిలిపి గ్రామస్తులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు మాట్లాడుతూ తమ గ్రామాన్ని 45.72 కాంటూరు పరిధిలో చేర్చి వెంటనే అర్ అండ్ ఆర్ సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలవరం కాఫర్ డ్యాం నుంచి బ్యాక్ వాటర్ రావడంతో ఆ మండలంలోని కొన్ని గ్రామాలు ప్రభావితమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాది గోదావరి వరద కారణంగా పొట్లవైగుడెం గ్రామం పూర్తిగా ముంపుకు గురైన సంగతి విదితమే.










