ఫొటో : సిమెంట్ రోడ్డు పనులు పరిశీలిస్తున్న సర్పంచ్
రోడ్డు పనులు పరిశీలన
ప్రజాశక్తి-అల్లూరు : మండలంలోని నార్త్ ఆములూరు గ్రామానికి నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులను మంగళవారం ఆ గ్రామ సర్పంచ్ షేక్.కరిముల్లా షా ఖాదర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కాంట్రాక్టర్ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ప్రజల శ్రేయస్సు కోసం సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టారని తెలియజేశారు. ఎన్నోయేళ్ల కల కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి సహకారంతో సహకారమైందని హర్షం వ్యక్తం చేశారు.










