ఫొటో : మాట్లాడుతున్న ఆర్‌డిఒ శీనానాయక్
రీ సర్వే రికార్డులు పరిశీలన
ప్రజాశక్తి-అల్లూరు : స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం కావలి ఆర్‌డిఒ శీనానాయక్ రీసర్వే సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఆయన తహశీల్దార్ శ్రీరామకృష్ణతో కలిసి మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్వహించిన రీ సర్వేపై పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయా తప్పిదాలను ఎప్పటికప్పుడు గుర్తించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. అంతే కాకుండా తగు వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ చెంచయ్య, సర్వేయర్ అన్రూప్, సీనియర్ అసిస్టెంట్ సుధీర్, తదితరులు పాల్గొన్నారు.










