- శ్రీ భ్రమర టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ రామచంద్రరావు
విజయవాడ : శ్రీ భ్రమర టౌన్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడికి ఖచ్చితమైన రాబడి ఉంటుందని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గళ్లా రామచంద్రరావు తెలిపారు. గత ఆరు సంవత్సరాల నుండి గుంటూరు, కృష్ణా, విజయవాడ, ప్రకాశం, బెంగళూరుల్లో పలు వెంచర్లు వేసి పూర్తి చేసి, కష్టమర్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని, మన్ననలను పొందామన్నారు. ఈ సందర్భంగా ఆయన 'ప్రజాశక్తి'తో మాట్లాడుతూ గూడవల్లిలో జక్కులనెక్కలం గ్రామంలో సిఆర్‌డిఎ ఆమోదించిన గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ వెంచర్‌ను ప్రారంభించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ వెంచర్ ప్రధానంగా ఏలూరు రోడ్డును ఆనుకొని, ప్రధాన విద్యాసంస్థలకు అతి సమీపంలో ఉన్నట్లు పేర్కొన్నారు. భ్రమర టౌన్‌షిప్స్ అపెక్స్ హైట్స్ వెంచర్ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో, మేధా పార్క్, గన్నవరం ఐటి టవర్స్‌కు సమీపంలో ఉందన్నారు. ఈ వెంచర్‌లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఓపెన్ జిమ్, ఇండోర్ గేమ్స్, ఎవెంజర్స్ పార్క్, పెర్గోలాస్, టెంపుల్ థీమ్ పార్క్, జాగింగ్ ట్రాక్ ఉన్నాయన్నారు. పాఠశాలలు, కళాశాలకు వెళ్లే పిల్లలు ఉన్న నివాసితులు తమ సొంత కల ఇంటిని నిర్మించుకోవడానికి ఈ స్థలాన్ని ఎంచుకోవచ్చన్నారు. భ్రమర టౌన్‌షిప్స్ అపెక్స్ హైట్స్ వెంచర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్‌ల ద్వారా నీటి సంరక్షణ విషయంలో ఒక్క అడుగు ముందుకు వేసి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిని అందిస్తున్నామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ కోసం అండర్ గ్రౌండ్ కేబులింగ్ వంటి ఆధునిక భద్రతా వ్యవస్థలు వెంచర్ గొప్పతనమన్నారు. ల్యాండ్‌స్కేపింగ్ గార్డెన్‌లు, సిసి కెమెరా నిఘా ప్రత్యేకతన్నారు. ప్లాట్‌ల కొనుగోలుదారులకు బ్యాంకు రుణాన్ని పొందే సౌకర్యాన్ని కూడా అందిస్తుందన్నారు. ఇతర వివరాలకు, ప్లాట్ బుకింగ్ కోసం 0866-2433060 నెంబరుకు సంప్రదించాలన్నారు.










