Sep 22,2022 22:59

ప్రజాశక్తి-మైలవరం 

రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతుందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఎన్టీఅర్‌ హెల్త్‌ యూనివర్సీటీకి పేరు మార్పు నిరసనగా గురువారం మైలవరంలో ర్యాలీ నిర్వహించి స్థానిక ఎన్టీఅర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా ఉమా మాట్లాడుతూ సీఎం తీసుకున్న నిర్ణయాలు ప్రజాగ్రహానికి గురై వైసీపీ ప్రభుత్వం కనుమరుగవుతుందని జోష్యం చెప్పారు. ఈకార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.