ప్రజాశక్తి గోరంట్ల : రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారని టిడిపి జిల్లా అధ్యక్షులు పార్థసారథి విమర్శించారు. మంగళవారం పట్టణంలో మండల కార్యకర్తలు, నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పార్థసారథి మాట్లాడుతూ అవినీతిని ప్రశ్నించే వారి పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్యకర్తలు నాయకులు ఐక్యతగా పార్టీకి పూర్వవైభవం తీసుకురావటానికి కృషి చేయాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణ భూకబ్జాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులను గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ సోమశేఖర్, హిందూపురం పార్లమెంట్ టిడిపి కార్యదర్శి నరసింహులు, మండల ప్రధాన కార్యదర్శి అశ్వర్థరెడ్డి, జిల్లా కార్యదర్శి వేణు రాయల్, ఉపాధ్యక్షులు జయరాం, గిరిధర్ గౌడ్, రంగయ్య, మాజీ సర్పంచి అమీబాయి, సర్పంచి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు










