అమరావతి : ఎపిలో గడిచిన 24 గంటల్లో 95,366 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,925 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. అదే సమయంలో కరోనాతో 26 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 19,20,178కి చేరగా.. మృతుల సంఖ్య 12,986కి చేరింది. ప్రస్తుతం 29,262 యాక్టివ్ కేసులు ఉండగా.. 18,77,930 మంది రికవరీ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 3,937 మంది కరోనా నుంచి కోలుకున్నారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు.. కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. కడప, ప్రకాశం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతిచెందారు.










