Dec 02,2022 22:16

కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కందికుంట

కదిరి టౌన్‌ : రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపుదామని కందికుంట వెంకటప్రసాద్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని కుట్టాగుళ్లలో నిర్వహించిన ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందికుంట ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్‌ పేరుతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రజలపై అన్ని విధాల పన్నులు వేస్తూ నిలువు దోపిడీ చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే ప్రతిపక్ష పార్టీలపై, ప్రజలపై అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి కౌన్సిలర్‌ గంగాభవాని, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తలుపుల : రాష్ట్రవ్యాప్తంగా టిడిపి చేపట్టిన ఇదేం ఖర్మ అనే కార్యక్రమాన్ని మండల పరిధిలోని గుంతపల్లిలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. వైసిపి పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుఆన్నరన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు పర్వీన్‌ భాను, నాయకులు నాగేంద్ర కుమార్‌, ముబారక్‌, రాజారెడ్డి, ఓబుల్‌ రెడ్డి, గోపాల్‌, నారాయణరెడ్డి, అలీపీరా, జయచంద్రతో పాటు అధికసంఖ్యలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
గోరంట్ల : మండలంలోని మల సముద్రం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో ఇదేమి ఖర్మ కార్యక్రమాన్నిశుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేకు ఆ గ్రామ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ వైసిపి పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను వివరించారు. అరాచక పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశ్వర్థరెడ్డి, సోమశేఖర్‌, వేణు రాయల్‌, నీలకంఠారెడ్డి, నరేంద్ర రాయల్‌, అజమతుల్లా, గిరి తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్‌ : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి రావడం మన ఖర్మ అని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఇదే ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని పట్టణంలోని 5,6.7 వార్డులలో టీడీపీ నాయకులు నిర్వహించారు. ఇందులో భాగంగా నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాప్రతిరేక విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమతం కాటమయ్య, చింతలపల్లి మహేశ్‌ చౌదరి, బోయరవిచంద్ర, పరిశేసుధాకర్‌, పురుషోత్తంగౌడ్‌, చింతపులుసు పెద్దన, భీమనేని ప్రసాదానాయుడు గరుగు వెంగప్ప,తో పాటు అధికసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.