Apr 29,2023 21:20

- మాట్లాడుతున్న ఖాదర్‌బాషా

రాయచోటి : వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, నేరాలు అవినీతి తప్ప జగన్‌కు ఏంతెలుసు అని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాష పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనక్రిమినల్‌ మైండ్‌తో 4 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెలిపారు. 31 కేసులున్న జగన్‌, 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని సూటిగా ప్రశ్నించారు. అహంకారికి అధికారమిచ్చిన ఫలితాన్ని ప్రజలు, రాష్ట్రం అనుభవిస్తున్నారు అన్నారు. క్రైమ్‌, కరెప్షన్‌తో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని వాపోయారు. ఎపి కంటే బీహార్‌ నయమనుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఒకవైపు మీ బిడ్డను అంటూనే, మరోపక్క దుష్టచతుష్టయం అని ముఖ్యమంత్రి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. సొంతపార్టీ ఎమ్మెల్సీ దళిత యువకుడిని చంపి, జైలుకెళ్లి తిరిగొస్తే అతనికి ఘనస్వాగతం పలికారున్నారు. కార్యక్రమంలో మండల రూరల్‌ అధ్యక్షులు ఊరికి నాటి వెంకటసుబ్బారెడ్డి, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి సత్యరెడ్డి, మాధవరం వెంకటరమణారెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి నూలివీడు శివారెడ్డి, రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి హరి అమర్‌నాధరెడ్డి, గన్‌మెన్‌ రాజు పాల్గొన్నారు.