Dec 27,2022 18:39

విద్యార్థిని అభినందిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -కందుకూరు : స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కందుకూరులో జరిగిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో శ్రీ సంస్కతి పాఠశాల విద్యార్థిని పివి దీపిక ఎంపికైనట్లు కోచ్‌ ఎస్‌కె అబ్దుల్‌ సలాం తెలిపారు. ఈ నెల 28,29, 30 తేదీల్లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పివి దీపిక ఎంపికైనట్లు జిల్లా తైక్వాంటో కార్యదర్శి ఎస్‌కె అబ్దుల్‌ సలాం తెలిపారు. పాఠశాల ఛైర్మన్‌ కొంకా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ పిల్లలు చదువుతో పాటు ఆటపాటలు అన్నిరకాల పోటీల్లో ప్రతిభను కనపరచాలని కోరారు. ఎంపికైన విద్యార్థినిని ఛైర్మన్‌ కొంకా చంద్రశేఖర్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ పి.శ్రీనివాసులు, ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.