ప్రజాశక్తి-విజయవాడ
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరులో ఈ నెల 24 నుంచి 26 వరకు జరిగే ఐద్వా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఐద్వా సెంట్రల్ సిటీ అధ్యక్షురాలు కె సరోజ కోరారు. మహాసభల విజయవంతం కోరుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని 1,24 డివిజన్లలో శుక్రవారం ఐద్వా జెండాలను ఆవిష్క రించారు. ముందుగా సంఘసంస్కర్త గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సరోజ మాట్లాడు తూ...మహిళల హక్కుల కోసం ఐద్వా రాజీలేని పోరాటం చేస్తుందని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. పెరిగిపోతున్న ధరల ప్రభావం మహిళలపై పడుతుందని అన్నారు. మహిళల హక్కుల కోసం ప్రతి మహిళ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌సిటీ సహాయ కార్యదర్శి ఎస్‌కె షకీలా, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.










