ఫుట్‌బాల్ గ్రౌండ్ అభివృద్ధికి సహకారం
ప్రజాశక్తి-బిట్రగుంట : బిట్రగుంట వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నూకసాని శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఫుట్‌బాల్ గ్రౌండ్ అభివృద్ధి కోసం ఆదివారం నెల్లూరులోని రైల్వే ఎడిఎన్ అపూర్వ వశిష్టని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విలేకరులతో మాట్లాడుతూ బిట్రగుంట రైల్వే గ్రౌండ్ అభివృద్ధి పనుల మేరకు రైల్వే ఎడి ఎఎన్ అనుమతి కోరగా సానుకూలంగా స్పందించారని, రైల్వే ఎడిఎన్ స్వయంగా విచ్చేసి బిట్రగుంటలోనే రైల్వే గ్రౌండ్ను పరిశీలించి అభివృద్ధి పనులను సమీక్షించి అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చారన్నారు. ఈ మేరకు బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు షేక్ నూరుద్దీన్ బిట్రగుంట రైల్వే స్టేషన్‌కి వెళ్లే రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఎడిఎన్ అపూర్వ వశిష్ట కోరారు. బిట్రగుంట అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సత్యనారాయణాచార్యులు, ఎకె సుందర్ రాజ్, విజయ శేఖర్, ఈ.రామయ్య, జనార్దన్ రెడ్డి, చప్పిడి రవి, స్టేషన్ సూపర్డెంట్ లక్ష్మీచంద్ మీన, బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యులు ఎకె భాగ్యరాజ్, అహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.










