Sep 13,2023 22:41

కాల్వలో పడిన ఆవు

ప్రజాశక్తి - జగ్గయ్యపేట : పట్టణంలోని ముక్త్యాల రోడ్‌లోని సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌ ఎదురుగా కాల్వలో బుధవారం అవు పడిపోయింది. ఆవును బయటికి తీసుకొచ్చేందుకు స్థానికులు ప్రయత్నించి నప్పటికీ ఆవు బయటకు రాకపోవడంతో ఫైర్‌స్టేషన్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది వచ్చి ఆవును పట్టణ మున్సిపల్‌ సిబ్బంది, స్థానికులు సహకారం అందించి ఒడ్డుకు చేర్చారు.