Oct 01,2023 12:55

ప్రజాశక్తి-తాడేపల్లి : స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా టిడిపి చేపట్టిన నిరసనపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. తాడేపల్లి మీడియా సమావేశంలో ఆయన  మాట్లాడుతూ... హోదా కోసం రోడ్డు ఎక్కితే జైల్లో వేస్తానన్న హెచ్చరించిన చంద్రబాబు.. ఇప్పుడు తాను అవినీతి చేసి దొరికితే ప్రజలు అందరూ రోడ్డు మీదకు రావాలంటూ పిలుపునిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను చేసిన పాపాలు, ఘోరాలే ఇవాళ చంద్రబాబును వెంటాడుతున్నాయని అన్నారు. విజిల్స్, డప్పు మోత మోగిస్తూ చేసిన టిడిపి నేతల్లో ఆనందం  తాండవిస్తోందని ఎద్దేవా చేశారు. లింగమనేని రమేష్ కరకట్ట ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చాడని చంద్రబాబు చెప్పారని తెలిపారు. అధికారం పోగానే ఆ ఇంటిని ప్రభుత్వానికి ఎందుకు తిరిగి అప్పగించలేదని మండిపడ్డారు. ఇంత వరకు ఆ ఇంటిలోనే ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు.