ధర్మవరం టౌన్ : చెన్నకేశవస్వామి బ్రహోమత్సవాలలో భాగంగా ఐదవ రోజు సోమవారం చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పుష్పమండపంపై ఊరేగించారు. పట్టణ పురవీధుల్లో ఉదయం ప్రత్యేకంగా అలంకరించిన పుష్పమండపంపై శ్రీదేవి, భూదేవి సమీతుడైన చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఈ ఊరేగింపులో చెన్నకేశవునికి అడుగడుగునా 'భక్తులు పూజలు చేయించి తమ మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం రాత్రి స్వామివారి కల్యాణోత్సవాన్ని వేదమంత్రాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. అన్నమయ్యసేవా మండలి అధ్యక్షుడు పొరాళ్లపుల్లయ్య శిష్యబందం అన్నమయ్య నగరసంకీర్తనలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ దాశెట్టిసుబ్రమణ్యం, డైరెక్టర్లు పోరాళ్లపద్మావతి, సత్రశాల సత్యనారాయణ, జగ్గా జయలక్ష్మీ దాడితోట సునీత, సౌందర్యలహరి, గిర్రాజుమహాలక్ష్మీ ఈఓ వెంకటేశ్వర్లు, అర్చకులు కోనేరాచార్యులు, భానుప్రకాశ్, పాల్గొన్నారు. మంగళవారం ఉదయం శేషవాహనం, సాయంత్రం గజవాహనాలపై చెన్నకేశవుడు ఊరేగనున్నట్టు. ఆలయ ఈవో తెలిపారు.










